తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- April 09, 2026
చెన్నై: ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల మేరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందంను బదిలీ చేశారు.ఆయన స్థానంలో తమిళనాడు క్యాడర్ ఏపీకి చెందిన సీనియర్ అధికారి ఎం.సాయి కుమార్ ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎం.సాయి కుమార్ అదే సాయంత్రం చెన్నై సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ మార్పు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిపాలనా మార్పులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి కుమార్, ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ, ప్రధాన కార్యదర్శి స్థాయిలో జరిగిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







