అజిత్-అధిక్ రవిచంద్రన్ కాంబో మళ్లీ షురూ
- April 10, 2026
కోలీవుడ్ స్టార్ హీరో, ‘థల’ అజిత్ కుమార్ తన తదుపరి చిత్రం #AK64 కోసం సిద్ధమవుతున్నారు. ప్యాషన్, ప్రొఫెషన్‌ను బ్యాలెన్స్ చేయడంలో అజిత్ రూటే వేరని ఈ సినిమా ప్లానింగ్ చూస్తుంటే అర్థమవుతోంది. రేసింగ్ పై తనకున్న మక్కువను ఏమాత్రం తగ్గించుకోకుండా ఆయన రూపొందించుకున్న ఈ కొత్త షెడ్యూల్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరియు అజిత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అజిత్ తన రెండు ప్యాషన్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రత్యేక ప్లానింగ్ చేశారు. నెలలో 15 రోజులు సినిమా షూటింగ్‌కు, మిగిలిన 15 రోజులు రేసింగ్‌కు కేటాయించబోతున్నారు. దీనివల్ల సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనా, తన రేసింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనేది ఆయన ఉద్దేశం.
అజిత్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల మధ్య కొన్ని భేదాలు రావడంతో ఈ చిత్రాన్ని అజిత్ స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారట. మరో నిర్మాణ సంస్థ కేవలం ఫండింగ్ సపోర్ట్ మాత్రమే అందిస్తుందని అజిత్ తన సొంత బ్యానర్‌పైనే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్.
పారితోషికం కంటే సినిమా అవుట్‌పుట్ అలాగే తన రేసింగ్ కూడా అనుకూలంగా ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.’గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తర్వాత అధిక్ రవిచంద్రన్ మళ్లీ అజిత్‌ను డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం. అజిత్ కొత్త మేకోవర్ మరియు ఆయన రేసింగ్ పట్ల చూపిస్తున్న ఆసక్తి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







