ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- April 10, 2026
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయ సముదాయంలోని టెర్మినల్-1 వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 09) సాయంత్రం టెర్మినల్ లోపల ఉన్న కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సులలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం టెర్మినల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌కే పరిమితమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, వార్డు సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 లోపల దట్టమైన పొగ కమ్ముకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయంలో కూర్చునే ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







