‘ఫౌజీ’ షూటింగ్..
- April 10, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతికి ‘రాజాసాబ్’తో వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాదే ఒక భారీ హిట్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రభాస్ పట్టుదలగా ఉన్నాడు.ఈ క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ పైనే అందరి దృష్టి నెలకొంది.రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని శరవేగంగా ముందుకు సాగుతోంది.
ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ, నిర్మాణ పనుల జాప్యం వల్ల డిసెంబరుకు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం మాత్రం సమయం వృథా కాకుండా ‘సెకండ్ యూనిట్’ను రంగంలోకి దించి యుద్ధ త్వరగా పనులు పూర్తి చేస్తోంది.ప్రస్తుతం ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తుండగా, మరోవైపు ఈ సెకండ్ యూనిట్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తూ సమయాన్ని ఆదా చేస్తున్నారు.
క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రెండు బృందాలతో పని చేయడం వల్ల అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబరులోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ లుక్, హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.మరి సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హను రాఘవపూడి నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







