'రంజీ'- ఫస్ట్ లుక్ రిలీజ్
- April 10, 2026
ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. అకృతి నంద సమర్పణలో శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
హీరో ఆర్యా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రంజీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇంటెన్స్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపించిన ఆర్యా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఆయన ధరించిన క్యాజువల్ కాస్ట్యూమ్ ఈ లుక్‌కు మరింత రియలిస్టిక్, రిలేటబుల్ వైబ్ తీసుకొచ్చింది. పాత్ర ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతుందో ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో వ్రంజనా పాండ్య హీరోయిన్ గా నటిస్తోంది. దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. రధన్ మ్యూజిక్ అందిస్తుండగా, రామ్ కె మహేష్ డీవోపీ, నార్నీ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్, అనిల్ పసల ఎడిటర్.
నటీనటులు: ఆర్యా, వ్రంజనా పాండ్య, దశరధ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ, మణికందన్ ఆర్., ఆచారి సాయిరాజ్, బెనర్జీ
నిర్మాతలు: మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి
సమర్పణ: అకృతి నంద
కథ, కధనం & దర్శకత్వం: పోలూరు కృష్ణ
సినిమాటోగ్రాఫర్: రామ్ కె మహేష్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: నార్నీ శ్రీనివాస్
ఎడిటర్: అనిల్ పసల
లిరిక్ రైటర్స్: సురేష్ బనిశెట్టి, శ్రీరామ్ తపస్వి
డైలాగ్స్: నవీన్ వాసిరెడ్డి
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







