'రేజర్' మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్
- April 10, 2026
టైటిల్ ప్రకటించినప్పటి నుంచే 'రేజర్' సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ వీడియో, విజువల్స్, అందరిలో క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బజ్ లభించడంతో ప్రేక్షకులలో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
మేకర్స్ 'రేజర్' షూటింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తి చేశారు. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉంది. థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
చిత్ర బృందం ఈరోజు 'రేజర్' వరల్డ్ ని పరిచయం చేసేలా ఆకట్టుకునే కొత్త పోస్టర్లను విడుదల చేసింది. కొత్త పోస్టర్లు ‘రేజర్’ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అర్బన్, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య ఇంటెన్స్ పవర్ ఫుల్ గా కనిపించిన రవిబాబు లుక్ ఆకట్టుకుంది. ఒక పోస్టర్‌లో చిన్నారి చేతిని పట్టుకుని వీధిలో నడుస్తూ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
దర్శకుడు రవి బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని పంచుకున్నారు. తన తండ్రి చలపతి రావు జయంతి అయిన మే 8, 2026న 'రేజర్' విడుదల కానుందని ప్రకటించారు.
రచన, దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.
‘రేజర్’ మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







