స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- April 12, 2026
హైదరాబాద్: తన పై ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యక్తి తనను డబ్బు డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకే కక్షపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం రాబోయే బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేస్తూ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు.
రాజకీయ ప్రచారాల ద్వారా కోట్లు సంపాదించే అవకాశాలు వచ్చినా, కేవలం తన విలువలను కాపాడుకోవడానికే వాటిని వదులుకున్నానని మంగ్లీ భావోద్వేగంగా స్పందించారు. తనకు డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని, ఈ స్కామ్‌లో తన ప్రమేయం ఉందని ఏ చిన్న ఆధారం దొరికినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. తనకు సంబంధం లేని వ్యక్తులను తన తమ్ముడని ప్రచారం చేయడం మానుకోవాలని, ఇలాంటి అక్రమ ఆరోపణలను తాను అస్సలు ఉపేక్షించబోనని ఘాటుగా హెచ్చరించారు.
ఈ వివాదంలో బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూసే వారిపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. మంగ్లీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానిజాలు తేలే వరకు తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె అభిమానులను మరియు మీడియాను కోరారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







