అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- April 13, 2026
మస్కట్ః ఒమన్ సుల్తానేట్‌లోని వ్యవసాయ మరియు పశుసంపద రంగాలలో అగ్రగామి గవర్నరేట్‌లలో ఒకటిగా అల్ ధాహిరా గవర్నరేట్ నిలిచింది. ఇది వ్యవసాయ భూమి మరియు అందుబాటులో ఉన్న నీటి వనరులతో ఆహార భద్రత మరియు పెట్టుబడులకుఒక ఆకర్షణీయంగా గుర్తింపు పొందింది.
గత కొన్నేండ్లలో ఈ గవర్నరేట్ వ్యవసాయం, పశుసంపద మరియు నీటి వనరులకు సంబంధించిన పెట్టుబడి ప్రాజెక్టులలో భారీ విస్తరణను నమోదు చేసిందని అల్ ధాహిరా గవర్నరేట్‌లోని వ్యవసాయ సంపద, మత్స్య మరియు జలవనరుల జనరల్ డైరెక్టరేట్ పరిధిలోని వ్యవసాయ అభివృద్ధి విభాగం డైరెక్టర్ అహ్మద్ రషీద్ అల్ అబ్రి తెలిపారు. గవర్నరేట్‌లో మొత్తం వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల సంఖ్య 50కి పైగా ఉందని తెలిపారు.
ఈ ప్రాజెక్టులు సుమారు 9,000 ఎకరాల విస్తీర్ణంలో, OMR50 మిలియన్లకు పైగా పెట్టుబలు ఉన్నాయని తెలిపారు. ఈ పెట్టుబడులు చేపల మార్కెట్లతో పాటు వ్యవసాయ, పశుసంపద మరియు జలవనరుల రంగాలలో విస్తరించి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులలో గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటు మరియు వెల్లుల్లి, ఉల్లిపాయల వంటి ఇతర పంటల సాగు కూడా ఉన్నాయని, ఇవి వ్యవసాయ ఉత్పత్తి వైవిధ్యీకరణకు మరియు స్వయం సమృద్ధి సాధనకు దోహదపడతాయని అల్ అబ్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









