33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- April 13, 2026
రియాద్ః ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ లోపం కారణంగా 33,250 టయోటా మరియు లెక్సస్ వాహనాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ వెనక్కి(రీకాల్) పిలిచింది. వాహనాల ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పార్కింగ్ చేసే సమయాల్లో వాహనాన్ని 'రివర్స్' గేర్‌లోకి మార్చినప్పుడు వెనుక వైపు దృశ్యాన్ని చూపించే కెమెరా (rearview camera) స్క్రీన్‌పై కనిపించకపోవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది.
ఈ లోపం 2022 నుండి 2025 మధ్య తయారైన పలు టయోటా మరియు లెక్సస్ మోడళ్లను ప్రభావితం చేస్తుందన్నారు. వీటిలో Land Cruiser, Crown, LX600, Prado, LC500, Mirai, Highlander, Camry, LS500/LS500h, RX, UX, NX మరియు ES మోడళ్లు ఉన్నాయని తెలిపింది. తమ వాహనాలు ఈ రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, వినియోగదారులు Recalls.sa వెబ్సైట్ లో తమ వాహన గుర్తింపు సంఖ్యను (VIN) నమోదు చేసి తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







