డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- April 13, 2026
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ (Degree Online Services Telangana–DOST) నోటిఫికేషన్‌ను సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు.విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి విడతకు సంబంధించిన స్పష్టమైన గడువును బోర్డు ప్రకటించింది:
మొదటి విడత: ఏప్రిల్ 15న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుకు మే 7 వరకు అవకాశం ఉంటుంది.
రెండో విడత: మే 15 నుండి మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మూడో విడత: మే 31న ప్రారంభమై జూన్ 15తో ముగుస్తుంది.
అర్హత కలిగిన విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







