సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- July 21, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వినియోగదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ (Ministry of Commerce) శుభవార్త తెలిపింది. మూడు నెలల పాటు కొనసాగే ప్రత్యేక డిస్కౌంట్ సీజన్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ సీజన్ ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది.
ఈ సందర్భంగా వ్యాపార సంస్థలు, రిటైల్ దుకాణాలు, ఈ-కామర్స్ స్టోర్లు ప్రత్యేక తగ్గింపు ధరలతో ఉత్పత్తులను విక్రయించవచ్చు. ముఖ్యంగా, ఈ మూడు నెలల డిస్కౌంట్ కాలం వ్యాపార సంస్థలకు ఏడాదికి అనుమతించే సాధారణ డిస్కౌంట్ రోజుల కోటాలో లెక్కించబడదని స్పష్టం చేసింది. వాణిజ్య మండళ్ల సమాఖ్య (Federation of Saudi Chambers)కు పంపిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆన్లైన్లోనే డిస్కౌంట్ లైసెన్స్
వ్యాపారులు, ఈ-కామర్స్ సంస్థలు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డిస్కౌంట్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అనుమతి లభించిన తర్వాత లైసెన్స్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించవచ్చని వివరించింది. అలాగే ప్రచార ఆఫర్లకు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యాపారులకు సూచించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ సీజన్లో అధిక సంఖ్యలో ప్రైవేట్ రంగ సంస్థలు పాల్గొని, వ్యాపారాలకు మరియు వినియోగదారులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలని ఫెడరేషన్ ఆఫ్ సౌదీ చాంబర్స్ కోరింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రతి వ్యాపార సంస్థకు ఏడాదికి గరిష్టంగా 90 రోజుల డిస్కౌంట్ ప్రచారం నిర్వహించే అనుమతి ఉంది. ఈ 90 రోజులను మూడు విడతలుగా విభజించుకోవచ్చు. ఒక్కో డిస్కౌంట్ లైసెన్స్ గరిష్టంగా 45 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. పూర్తి స్థాయి లేదా పాక్షిక (Partial) డిస్కౌంట్లకు ఈ లైసెన్స్ వర్తిస్తుంది.
అయితే, తాజాగా ప్రకటించిన ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగే ప్రత్యేక మూడు నెలల డిస్కౌంట్ సీజన్ ఈ వార్షిక పరిమితికి అదనంగా ఉంటుంది. దీంతో వ్యాపార సంస్థలు అదనపు ప్రచార ఆఫర్లను నిర్వహించే అవకాశం పొందనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







