రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- April 13, 2026
హైదరాబాద్: IPL 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో తొలి ఓటమిని చవి చూసింది. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న రాజస్తాన్ కు ఓటమి రుచి చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది రెండో విజయం. ఐదు మ్యాచులు ఆడగా మూడింటిలో ఓటమిపాలైంది. అటు రాజస్థాన్ 5 మ్యాచులు ఆడగా ఇదే తొలి పరాజయం.
హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో హింగ్, షకీబ్ హస్సన్ చెలరేగారు. తలో 4 వికెట్లు పడగొట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







