'అన్లిమిటెడ్' వాయిస్ కాలింగ్ ఆఫర్ : ఎయిర్టెల్
- August 05, 2016
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా 'అన్లిమిటెడ్' వాయిస్ కాలింగ్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,199కి నెలలో అన్లిమిటెడ్ మొబైల్ కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. త్వరలో రిలయన్స్ జియో సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎయిర్టెల్ రూ.1,199తో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు, ఎస్సెమ్మెస్/డేటా కూడా ఈ ప్లాన్‌లో ఉంటుంది. రిలయన్స్ జియో 4జీ వైర్లెస్ సర్వీసుల కోసం ఆసక్తి ఉన్న వారికోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. త్వరలో సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







