సౌదీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు..ఎన్‌సీఎం హెచ్చరిక..!!
- April 14, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించవచ్చని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సీఎం) హెచ్చరించింది. రియాద్ ప్రాంతంలోని దక్షిణ, పశ్చిమ భాగాలతో పాటు మక్కా, అసిర్, అల్-బహా ప్రాంతాల తూర్పు భాగాలలో ఈ వర్షపు వాతావరణం ఉంటుంది. ఇది లోయలు, కొండవాగులలో ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని ఎన్‌సీఎం పేర్కొంది. దీనితో పాటు వడగళ్ళు, అధిక వేగంతో బలమైన గాలుల వీస్తాయని ఎన్‌సిఎం ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. ముఖ్యంగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలలో సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. లోయలకు మరియు వరద మార్గాలకు దూరంగా ఉండాలని అల్-ఖహ్తానీ కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







