సార్క్‌ సమావేశం గురించి పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌..

- August 05, 2016 , by Maagulf
సార్క్‌ సమావేశం గురించి పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌..

పాకిస్థాన్‌లో సార్క్‌ సమావేశాల్లో పాల్గొని వచ్చిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈరోజు పార్లమెంటులో పర్యటన గురించి మాట్లాడారు. సార్క్‌ సమావేశంలో భారత్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందని, మిగతా సార్క్‌ దేశాలను కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరినట్లు రాజ్‌నాథ్‌ వెల్లడించారు. కేవలం ఉగ్రవాదంపైనే కాకుండా.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో వెల్లడించినట్లు రాజ్‌నాథ్‌ రాజ్యసభలో తెలిపారు. పాకిస్థాన్‌ మావన హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. సమావేశం గురించి పలు అంశాలను సభలో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రశంసించొద్దని అన్ని సార్క్‌ దేశాల నేతలను కోరినట్లు తెలిపారు.'నిన్నటి సమావేశంలో నా ప్రసంగాన్ని పాక్‌ మీడియా ప్రసారం చెయ్యకపోవడంపై నేను మాట్లాడను.. కానీ భారత మీడియా సంస్థలు దూరదర్శన్‌, ఏఎన్‌ఐ, పీటీఐ ప్రతినిధులను నా ప్రసంగం సమయంలో లోపలికి అనుమతించలేదు' అని రాజ్‌నాథ్‌ పార్లమెంటులో స్పష్టంచేశారు. సార్క్‌ సమావేశంలో పాకిస్థాన్‌ రాజ్‌నాథ్‌ పట్ల ప్రవర్తించిన తీరును ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు సహా అందరూ ఖండించారు. రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని పాక్‌ ప్రసారం చెయ్యనీయకపోవడాన్ని తప్పుపట్టారు. పాకిస్థాన్‌ భారత హోం మంత్రి పట్ల సరైన ప్రొటోకాల్‌ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జనతాదళ్‌ యునైటెడ్‌ నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. సమావేశం అనంతరం పాక్‌ మంత్రి అందరినీ భోజనానికి ఆహ్వానించగా.. రాజ్‌నాథ్‌ భోజనం చెయ్యకుండానే భారత్‌కు వెనుదిరిగారు. ఈ విషయంపై ప్రశ్నించగా.. తాను పర్యటన సమయం తగ్గించడానికి భోజనం చెయ్యలేదని.. పాక్‌కు వెళ్లింది భోజనం చెయ్యడానికి కాదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com