'వాలా Ⅱ' చిత్రం ఏప్రిల్ 24న తెలుగులో రిలీజ్
- April 15, 2026
కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.
సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయల మైల్ స్టోన్ ని అధిగమించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ, ''వాలా Ⅱ' తెలుగు వెర్షన్ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాత సాహు గారపాటి అధికారికంగా ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల ఆసక్తి ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం OTTలో అందుబాటులో ఉన్న ఈ మూవీ సిరీస్ (franchise) మొదటి భాగం, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి ఊహించని రీతిలో అద్భుతమైన ఆదరణను పొందింది. అందులోని విభిన్నమైన హాస్యం, యువతను ఆకట్టుకునే కథనం, వాస్తవికమైన కథాంశం ఒక బలమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. దీంతో సహజంగానే, ఈ సీక్వెల్ థియేటర్లలో విడుదల కాబోతుండటంతో దానిపై అంచనాలు భారీగా పెరిగాయి.
చిత్రంపై బజ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో ''వాలా Ⅱ' తెలుగు విడుదలై సాధించే విజయాన్ని చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు: హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V, వేద శంకర్, అల్ఫోన్స్ పుత్రన్
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సావిన్ SA
రచయిత: విపిన్ దాస్
నిర్మాతలు: విపిన్ దాస్, హారిస్ దేశం, సాహు గారపాటి, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్
DOP: అఖిల్ లైలాసురన్
ఎడిటర్: కన్నన్ మోహన్
మ్యూజిక్ సూపర్ విజన్: అంకిత్ మేనన్
నేపథ్య సంగీతం: A TEAM
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







