హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- April 15, 2026
అమెరికా: హర్మూజ్ దిగ్బంధనం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల కోసం హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాదన్నారు ట్రంప్. తమ నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్.. త్వరలో చైనాలో పర్యటిస్తానని తెలిపారు. జిన్ పింగ్ తనను అప్యాయంగా కౌగిలించుకుంటారని ట్రంప్ చెప్పారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయబోము అని చైనా తమకు హామీ ఇచ్చిందన్నారు ట్రంప్.
”హర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచే నా నిర్ణయంతో చైనా “చాలా సంతోషంగా” ఉంది. ఈ నిర్ణయాన్ని “వారి కోసం” మిగతా ప్రపంచం కోసం తీసుకుంటున్నా. ఫ్యూచర్ లో ఈ పరిస్థితి పునరావృతం కాదని, ఇరాన్‌కు ఆయుధాలు పంపకూడదని చైనా అంగీకరించింది” అని ట్రంప్ తెలిపారు.
”నేను హర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉంది. నేను ఇది వారి కోసమే కాకుండా, ప్రపంచం కోసం కూడా చేస్తున్నాను. ఈ పరిస్థితి మళ్లీ ఎప్పటికీ పునరావృతం కాదు. ఇరాన్‌కు ఆయుధాలు పంపకూడదని వారు అంగీకరించారు” అని ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు ట్రంప్.
రాబోయే వారాల్లో జరగనున్న పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నుండి తనకు ఘన స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు తెలివిగా, సమర్థవంతంగా కలిసి పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, సంఘర్షణ కంటే సహకారమే శ్రేయస్కరమని, అవసరమైతే అమెరికా సైనికపరంగా అత్యంత సమర్థవంతంగా ఉంటుందన్నారు.
“నేను కొన్ని వారాల్లో చైనాకి వెళ్లినప్పుడు అధ్యక్షుడు జిన్ పింగ్ నన్ను గట్టిగా కౌగిలించుకుంటారు. మేమిద్దరం తెలివిగా, చాలా బాగా కలిసి పని చేస్తున్నాము. పోరాడటం కంటే ఇది మేలు కదా. కానీ గుర్తుంచుకోండి, అవసరమైతే పోరాడటంలో మేం చాలా నిష్ణాతులం. ఇతరులకన్నా ఎంతో ఉత్తమం” అని ట్రంప్ తెలిపారు.
ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాశానని, దానికి ప్రతిస్పందనగా చైనా టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని జిన్ పింగ్ బదులిచ్చారని ట్రంప్ ఇంతకుముందు చెప్పారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలు 50 శాతం వరకు తక్షణ సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గత వారం ఆయన హెచ్చరించారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించి, ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో సుమారు 20 శాతానికి అంతరాయం కలిగించిన 45 రోజుల తర్వాత, రెండు వారాల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఈ కీలక జలమార్గం గుండా రవాణా అనిశ్చితంగానే ఉంది.
సంఘర్షణకు ముందు నమోదైన రోజుకు 130కి పైగా రాకపోకలతో పోలిస్తే, ఇప్పుడు ట్రాఫిక్ చాలా స్వల్ప భాగానికి పడిపోయింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







