నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’..
- April 16, 2026
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఇప్పుడు డిజిటల్ తెరపై రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రియులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా అందుబాటులోకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం ఏకంగా ₹80 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఈ డీల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. కేవలం 20 నిమిషాల చర్చల తర్వాతే నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది పవర్ స్టార్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
సినిమా గురించి..
గురువారం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్స్, శ్రీలీల , రాశీ ఖన్నాల గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ లభించినప్పటికీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







