IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- April 16, 2026
IPL 2026: ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో గెలుపు చేరింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల టార్గెట్ ను పంజాబ్ అలవోకగా చేజ్ చేసింది. 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది పంజాబ్. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సింగ్ 39 బంతుల్లోనే 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు బాదాడు.
ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది 4వ విజయం. ఇంత వరకు ఒక్క ఓటమి లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ కి వరుసగా నాలుగో పరాజయం. 5 మ్యాచులు ఆడిన ముంబై నాలుగింటిలో ఓటమిపాలైంది. ముంబై పై గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది పంజాబ్.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







