చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- April 17, 2026
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు క్రీడా లోకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న తన స్నేహితుడిని ఆదుకోవడానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు మాజీ క్రీడాకారులు ముందుకు రావడం విశేషం.
కాంబ్లీకి అత్యంత సన్నిహితుడైన మాజీ అంపైర్ మార్కస్ కౌటో ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. ఇందులో సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు.కేవలం డబ్బు మాత్రమే కాకుండా, కాంబ్లీ మానసికంగా కుంగిపోకుండా మాజీ క్రికెటర్లు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.ఈ గ్రూప్ సభ్యులు తమ పేర్లు బయటకు రాకుండా కాంబ్లీ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
మార్కస్ కౌటో తెలిపిన వివరాల ప్రకారం.. కాంబ్లీ ప్రస్తుతం తీవ్రమైన మతిమరుపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. “ఆయనకు పూర్తి స్థాయిలో మతిమరుపు రాలేదు కానీ, సాధారణ విషయాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు విషయాలు గుర్తొస్తాయి, మరుక్షణమే మరచిపోతారు. గత ఆరు నెలలుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది” అని కౌటో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







