జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా 'జో'
- April 17, 2026
లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వారి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన 'కరుడన్', 'మామన్' తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడవ చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
విమర్శకుల పరంగా, కమర్షియల్ గా విజయం సాధించిన 'జో' చిత్రంతో విశేష ప్రశంసలు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రం ఆయన ఒక సరికొత్తగా కనిపించనున్నారు.
'జో' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలవిక మనోజ్, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.
'కర్ణన్', 'వాళై' వంటి చిత్రాలలో తన విజువల్స్ తో ఆకట్టుకున్న తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు.
ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







