మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- April 17, 2026
న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాభివృద్ధిలో మహిళా శక్తి పాత్రను గుర్తించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని ఎంపీలను అభ్యర్థించారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదని, కోట్ల మంది మహిళల ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల సాధన కోసం దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “మహిళల మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు. ఈ చారిత్రక ఘట్టం కోసం మనం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మనందరం కలిసి చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది” అని ఆయన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి నారీ శక్తికి గౌరవం ఇవ్వాలని ఆయన సభను కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







