'పాపం ప్రతాప్' ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు: హీరో తిరువీర్

- April 17, 2026 , by Maagulf
\'పాపం ప్రతాప్\' ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు: హీరో తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు.

థాంక్యూ మీట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ముందు ఎక్కడ ‘పాపం ప్రతాప్’ అవుతానేమో అనే భయం ఉండేది, కానీ ఆడియన్స్ ‘వీర ప్రతాప్’ చేశారు. ఆడియన్స్‌కు కృతజ్ఞతలు. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు బాగా ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. నిజంగా ఇంత కనెక్ట్ అవుతారని అనుకోలేదు. ప్రతి మగాడి విజయానికి అండగా నిలిచే ప్రతి మహిళకు ఈ ‘పాపం ప్రతాప్’ అంకితం. మీ భర్తలకు మీరు ఇచ్చే బెస్ట్ రిటర్న్ ఈ సినిమా. థాంక్యూ సో మచ్.

రాశి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయింది. నేను మా అమ్మాయితో కలిసి ఈ సినిమా చూసి వచ్చాను. ఆమె ‘పాపం ప్రతాప్ 2’ ఎప్పుడొస్తుంది అని అడిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్‌ఫుల్ సినిమాలో నేనున్నాననే ఆనందం కలిగింది. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడే హిట్ అవుతుందని అర్థమైంది. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. పాయల్ అద్భుతంగా నటించింది. నా కొడుకు పాత్రలో తిరువీర్ చాలా బాగా నటించాడు. తను మంచి ఫ్యామిలీ హీరో.

పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సక్సెస్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ గారికి థాంక్యూ సార్. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ‘బుజ్జమ్మ’ పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు అంతా పాజిటివ్‌గా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఇంకా ఎక్కువ మందికి చేరాలి. అందరూ వెళ్లి చూడండి. పాయల్ అద్భుతంగా నటించింది. రాశి గారు ఈ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈటీవీ విన్, మా నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటాను. నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు.

నిర్మాత రాకేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రీమియర్స్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో అద్భుతమైన స్పందన ఉంది. ప్రతి షోకు ప్రేక్షకులు పెరుగుతున్నారు. చూసినవారంతా చాలా బాగుందని చెబుతున్నారు. టికెట్ ధర 99  రూపాయలు మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా సంతృప్తి పొందుతారు. తిరువీర్ ఫెంటాస్టిక్‌గా నటించారు. టీమ్ అందరికీ థాంక్యూ.

నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరికీ కంగ్రాట్యులేషన్స్. రాశి గారితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ‘పాపం ప్రతాప్’ ఇప్పుడు ‘వీర ప్రతాప్’ అయ్యాడు. ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పాం, రెస్పాన్స్ కూడా అలాగే వస్తోంది. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది. మంచి సినిమా చూడాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. తిరువీర్ పాపం స్టార్ కాదు, బ్లాక్‌బస్టర్ స్టార్.

యువకాంత్ మాట్లాడుతూ.. సినిమాకి  చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ నాన్‌స్టాప్‌గా నవ్వుతున్నారు. తప్పకుండా ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com