ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- April 17, 2026
ముంబై: ముంబైలో అత్యంత ఘనంగా జరిగిన తొలి ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ 2026 వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ సత్తా చాటింది. 12 భాషల, 12 సినీ పరిశ్రమలను ఒకే తాటిపైకి తీసుకువస్తూ నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవంలో టాలీవుడ్ ప్రముఖులు ప్రధాన పురస్కారాలను కైవసం చేసుకున్నారు.
-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్)
-ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
-ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్
-భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లకు ప్రత్యేక పురస్కారాలు
-లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న వెటరన్ హీరోయిన్ రేఖ
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుక 12 భారతీయ భాషల చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వైభవంగా నిర్వహించారు.
తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్) అవార్డు అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి, ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’కు గాను దర్శకుడు కార్తిక్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అవార్డులు అందుకున్నారు.
ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లను ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. కమల్ హాసన్‌కు నిర్మాత అల్లు అరవింద్ అవార్డు ప్రదానం చేశారు. ఈ వేడుకలో వెటరన్ హీరోయిన్ రేఖ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
హీరో రానా, హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా ఈ వేడుకలు ఆద్యంతం అద్భుతంగా సాగాయి. అవార్డు గ్రహీతలతో పాటు 12 పరిశ్రమలకు చెందిన ప్రముఖ తారలు హాజరైన ఈ వేదిక అంగరంగ వైభవంగా మెరిసింది.
అవార్డ్ వేడుకలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 'తండేల్’ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్. తండేల్ రాజు పాత్ర నాకు చాలా విషయాలు నేర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఫిషర్‌మ్యాన్ కథ ఇది. అది నాకు ఒక మెమొరబుల్ జర్నీ. ఈ సినిమా నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చింది. మా డైరెక్టర్ చందు మొండేటి గారికి, మా నిర్మాత అల్లు అరవింద్ గారికి, వాసు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అందరికీ థ్యాంక్యూ సో మచ్.”
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా. 50 కోట్లతో తీసిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అది ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇది ఒక సింపుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను నవ్వించగలగడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. ఈ వేడుకలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. జ్యూరీ సభ్యులకు, విష్ణు ఇందూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం ఫ్యామిలీ స్టోరీ కావడమే. ఈ సందర్భంగా మా హీరో విక్టరీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మా టీమ్ అందరికీ థ్యాంక్స్.
హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ అవార్డు అందుకోవడం నా మనసును కదిలించింది. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ఇది నా కుటుంబం నాకు ఇచ్చిన అవార్డుగా భావిస్తున్నాను. అల్లు అరవింద్ గారు ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. 12 పరిశ్రమలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇంత ఘనంగా అవార్డు వేడుక నిర్వహించాలని భావించిన విష్ణు ఇందూరి గారి ఆలోచనను అభినందిస్తున్నాను.
హీరోయిన్ రేఖ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవార్డు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కమల్ హాసన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు ప్రత్యేకమైన అనుభూతి. 12 పరిశ్రమలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న విష్ణు ఇందూరి గారికి అభినందనలు. ఈ అవార్డును లతా మంగేష్కర్, ఆశా భోస్లే గార్లకు అంకితం చేస్తున్నాను.
విష్ణు ఇందూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఈ రోజు మనం కేవలం అవార్డ్స్ వేడుకను నిర్వహించడం మాత్రమే కాదు, ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తున్నాం. ఒకటే భారతదేశం, అలాగే అలాగే ఈ దేశంలో సినీ పరిశ్రమ కూడా ఒకటే. దేశం మీరు ఏ భాష నుంచి వచ్చినా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, మనం అందరం ఒకటే అనే భావనను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భారతీయ సినిమా కూడా ఒకటే అన్న నమ్మకంతో ముందుకు సాగాలి. ఈ ఆలోచనతోనే INCA ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 12 ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన మీ అందరితో కలసి పని చేస్తూ దీనిని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలని మా లక్ష్యం.
భాషల వారీగా INCA అవార్డ్స్ గ్రహీతలు:
🔹 అస్సామీ
ఉత్తమ నటుడు: రవి శర్మ (రుద్ర)
ఉత్తమ నటి: నందిని కశ్యప్ (రుద్ర)
ఉత్తమ దర్శకుడు: రక్తిమ్ కమల్ బరువా (గులై సూర్)
ఉత్తమ చిత్రం: జెంగ్ ఎంటర్టైన్‌మెంట్, ASFFDC – గులై సూర్
🔹 బెంగాళీ
ఉత్తమ నటుడు: ప్రోసెన్జిత్ చటర్జీ (దేవి చౌధురాణి)
ఉత్తమ నటి: కౌశాని ముఖర్జీ (కిల్‌బిల్ సొసైటీ)
ఉత్తమ దర్శకుడు: అన్నపూర్ణ బసు (శార్థోపర్)
ఉత్తమ చిత్రం: హోయిచోయ్ స్టూడియోస్, SVF ఎంటర్టైన్‌మెంట్ – ది ఏకెన్: బెనారస్ ఎ బిభిషికా
🔹 భోజ్‌పురి
ఉత్తమ నటుడు: దినేష్ లాల్ యాదవ్ (మేరే హస్బండ్ కి షాది హై)
ఉత్తమ నటి: అమ్రపాలి దూబే (మేరే హస్బండ్ కి షాది హై)
ఉత్తమ దర్శకుడు: విశాల్ వర్మ (హమార్ నామ్ బా కన్హయ్యా)
ఉత్తమ చిత్రం: గిరిరాజ్ ప్రొడక్షన్ – హమార్ నామ్ బా కన్హయ్యా
🔹 గుజరాతీ
ఉత్తమ నటుడు: శ్రుహాద్ గోస్వామి (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)
ఉత్తమ నటి: జాన్కి బోడియాలా (వష్ లెవల్ 2)
ఉత్తమ దర్శకుడు: అంకిత్ భూపత్‌భాయ్ సఖియా (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)
ఉత్తమ చిత్రం: మానిఫెస్ట్ ఫిలిమ్స్, జయ వ్యాస్ ప్రొడక్షన్, సౌల్ సుల్త్రా, నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్, RD బ్రదర్స్ – లాలో
🔹 హిందీ
ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ చిత్రం: దినేష్ విజన్ & మాడ్‌డాక్ ఫిలిమ్స్ – ఛావా
🔹 కన్నడ
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)
ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార)
ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ చిత్రం: హోంబలే ఫిలిమ్స్ – కాంతార
🔹 మలయాళం
ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ)
ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ దర్శకుడు: డొమినిక్ అరుణ్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ చిత్రం: వే ఫారర్ ఫిలిమ్స్ – లోక చాప్టర్ వన్: చంద్ర
🔹 మరాఠీ
ఉత్తమ నటుడు: దిలీప్ ప్రభావాల్కర్ (దశావతార్)
ఉత్తమ నటి: అమృత సుభాష్ (జరాన్)
ఉత్తమ దర్శకుడు: సుబోధ్ ఖనోల్కర్ (దశావతార్)
ఉత్తమ చిత్రం: ధున్ ప్రొడక్షన్స్ – స్థల్
🔹 ఒడియా
ఉత్తమ నటుడు: బబుషాన్ మహంతి (బౌ బుట్టు భూత)
ఉత్తమ నటి: అర్చిత సాహూ (బౌ బుట్టు భూత)
ఉత్తమ దర్శకుడు: సబ్యసాచి మహాపాత్ర & కుమార్ సి. దేవ్ మహాపాత్ర (అనంత)
ఉత్తమ చిత్రం: బబుషాన్ ఫిలిమ్స్ – బౌ బుట్టు భూత
🔹 పంజాబీ
ఉత్తమ నటుడు: తరసెం జస్సర్ (గురు నానక్ జహాజ్)
ఉత్తమ నటి: సర్గున్ మెహతా (సర్బాలా జీ)
ఉత్తమ దర్శకుడు: షరన్ ఆర్ట్ (గురు నానక్ జహాజ్)
ఉత్తమ చిత్రం: వెహ్లి జన్తా ఫిలిమ్స్, ట్రూ రూట్స్ ప్రొడక్షన్స్ – గురు నానక్ జహాజ్
🔹 తమిళం
ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా)
ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)
ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్)
ఉత్తమ చిత్రం: మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్టైన్‌మెంట్ – టూరిస్ట్ ఫ్యామిలీ
🔹 తెలుగు
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ చిత్రం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయి సూపర్ యోధా
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్
మిథూన్, సచేత్-పరంపర,
రిషభ్ కాంత్, విశాల్ మిశ్రా,
తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా,
అర్స్లాన్ నిజామి
సినిమా: సయ్యారా
భాష: హిందీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ
షాజీ కుమార్
సినిమా: తుడరం
భాష: మలయాళం
ఉత్తమ సహాయ నటుడు
శరత్ కుమార్
సినిమా: 3BHK
భాష: తమిళం
ఉత్తమ సహాయ నటి
సిమ్రాన్ మంగేశ్కర్
సినిమా: సితారే జమీన్ పర్
భాష: హిందీ
ఉత్తమ పరిచయ నిర్మాత
మానిఫెస్ట్ ఫిలిమ్స్,
జయ వ్యాస్ ప్రొడక్షన్,
సౌల్ సుల్త్రా,
నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్,
ఆర్‌డీ బ్రదర్స్
సినిమా: లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే
భాష: గుజరాతీ
ఉత్తమ ఎడిటర్
శివకుమార్ పనిక్కర్
సినిమా: ధురంధర్
భాష: హిందీ
ఉత్తమ కథ & స్క్రీన్‌ప్లే
బషరత్ పీర్, నీరజ్ ఘయ్వాన్, సుమిత్ రాయ్
సినిమా: హోంబౌండ్
భాష: హిందీ
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)
విశాల్ మిశ్రా – "తుమ్ హో తో"
సినిమా: సయ్యారా
భాష: హిందీ
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)
శ్రేయా ఘోషల్ – (సాంగ్: సయ్యారా రిప్రైజ్)
సినిమా: సయ్యారా
భాష: హిందీ
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
శశ్వత్ సచ్దేవ్
సినిమా: ధురంధర్
భాష: హిందీ
బెస్ట్ VFX
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ VFX, డెక్కన్ డ్రీమ్స్
సినిమా: మిరాయ్ సూపర్ యోధా
భాష: తెలుగు
ఉత్తమ పరిచయ నటుడు
అహాన్ పాండే
సినిమా: సయ్యారా
భాష: హిందీ
ఉత్తమ పరిచయ నటి
రియా శిబు
సినిమా: సర్వం మాయ
భాష: మలయాళం
ఉత్తమ పరిచయ దర్శకుడు
కీర్తిశ్వరన్ – సినిమా: డ్యూడ్ (తమిళం)
రామ్ జగదీష్ – సినిమా: కోర్ట్ (తెలుగు)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
వినేష్ బంగ్లాన్
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ
ఉత్తమ హాస్య నటుడు
రేవంత్ (బుల్లి రాజు)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం
భాష: తెలుగు
బెస్ట్ కాస్టింగ్
ముఖేష్ ఛబ్రా
సినిమా: ధురంధర్
భాష: హిందీ
ఉత్తమ విలన్
గుల్షన్ దేవయ్య
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ
ఉత్తమ డాన్స్ కొరియోగ్రఫీ
సాండీ మాస్టర్
సినిమా: కూలీ
భాష: తమిళం
ఉత్తమ ఫైట్ కొరియోగ్రఫీ
టోడర్ లాజారోవ్
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
షీతల్ ఇక్బాల్ శర్మ
సినిమా: ఛావా
భాష: హిందీ
పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ఒకే తాటి పైకి తీసుకొచ్చి ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది.


తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









