కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- April 23, 2026
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో ఈ కేసు సంచలనం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో బస చేసిన ఆ విదేశీ మహిళపై అక్కడ పనిచేసే వృజేష్‌కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు హోమ్‌స్టేలోని వైఫైను మూడు రోజుల పాటు ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మైసూరుకు చేరుకుని అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు హోమ్‌స్టే యజమానిని కూడా అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్‌పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









