కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్..
- April 25, 2026
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కవిత.. భారీ జనసంద్రోహం మధ్య కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు.
పార్టీ పేరును ప్రకటించిన ఆమె ఆ వెంటనే జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. సీఎం సీఎం అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. కవిత కొత్త పార్టీ జెండాలో పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. జెండా మధ్యలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరు ఉంది. జెండా కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉంది. దాని మధ్యలో తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన పేరు వైట్ కలర్‌లో ఉంది. మిగిలిన జెండా మొత్తం పసుపు రంగులో ఉంది. మొత్తానికి అనుకున్న విధంగా కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







