ఎన్‌టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- April 25, 2026
**
ఎన్‌టీఆర్ 103వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీపీసీ ఇండియా) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎఫ్‌టీపీసీ ఇండియా ఎన్‌టీఆర్ లెజెండరీ అవార్డ్స్ – 2026 పోస్టర్‌ను కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు.
భారతదేశంలోని సినీ, సామాజిక, విద్య, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించేందుకు నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటిలను పురందేశ్వరి అభినందించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ, ఎన్‌టీఆర్ శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న తమ సంస్థ, ఈసారి మే 28న అన్నగారి జన్మదిన వేడుకలను మరింత వైభవంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సంస్థ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ, సినీ రంగంతో పాటు ప్రజా జీవితంలో సామాజిక చైతన్యం, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసిన ఎన్‌టీఆర్ సేవలను అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల సినీ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు తెలుగు సినీ, సామాజిక రంగాల ప్రముఖులు హాజరుకానున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ పాతూరి నాగభూషణం ,విజయ స్కూల్ అఫ్ నర్సింగ్ చైర్మన్ తట్టి అర్జున రావు ,సంస్థ టెక్నాలజీ వింగ్ చైర్మన్ కోడే చైతన్య, ఫోటోగ్రఫీ చైర్మన్ రామిశెట్టి అప్పారావు, సభ్యులు నవీన్ , జన్ను పవన్,అనంతేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







