ఒమన్ కార్మిక చట్టం ప్రకారం ఓవర్‌టైమ్ కు ఉద్యోగి అంగీకారం తప్పనిసరా?
- April 26, 2026
మస్కట్ః రాయల్ డిక్రీ 53/2023 ప్రకారం.. ఒమన్ కార్మిక చట్టం, కార్మికుల అంగీకారం లేకుండా ఒక ఉద్యోగిని ఓవర్‌టైమ్ చేయమని బలవంతం చేయలేము. దీనికి సంబంధించి ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. అయితే, వర్క్ అవసరాల దృష్ట్యా యజమాని ఒక కార్మికుడిని అదనపు గంటలు పని చేయమని కోరవచ్చని న్యాయరంగ నిపుణుడు డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం అల్ జద్జాలి స్పష్టం చేశారు. సాధారణ నియమం ప్రకారం, ఓవర్‌టైమ్ కేటాయించే ముందు కార్మికుడి అంగీకారం అవసరం. కార్మికుడు అంగీకరించినట్లయితే, ఓవర్‌టైమ్‌తో సహా మొత్తం పని గంటలు రోజుకు 12 గంటలకు మించకూడదు. ప్రతి ఓవర్‌టైమ్ గంటకు కార్మికుడికి ప్రాథమిక వేతనంతో పాటు, పగటిపూట పనికి కనీసం 25% అదనంగా మరియు రాత్రిపూట పనికి (రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు) కనీసం 50% అదనంగా చెల్లించాలన్నారు.
పేమెంట్ కు బదులుగా, యజమాని పనిచేసిన ఓవర్‌టైమ్ గంటలకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయవచ్చని, వీక్లీ హాఫ్ రోజున లేదా అధికారిక సెలవు దినాన ఓవర్‌టైమ్ చేసినట్లయితే, కార్మికుడు ఆ గంటలకు సాధారణ రోజువారీ వేతనంతో పాటు 100% ప్రాథమిక వేతనానికి లేదా పనిచేసిన ప్రతి రోజుకు ఒక పరిహార విశ్రాంతి దినానికి అర్హులని ఆయన వివరించారు.
అయితే, కొన్ని పరిమిత మినహాయింపుల ప్రకారం.. రెండు సందర్భాల్లో కార్మికుడి అంగీకారం లేకుండానే యజమాని ఓవర్‌టైమ్ కోరవచ్చు. మొదటిది.. వార్షిక ఇన్వెంటరీ, బడ్జెట్ తయారీ, లిక్విడేషన్, ఖాతాల ముగింపు, లేదా డిస్కౌంట్ అమ్మకాల కోసం కోరవచ్చు. రెండవది.. ప్రమాదాన్ని నివారించడానికి, దాని పరిణామాలను సరిదిద్దడానికి, త్వరగా పాడైపోయే వస్తువుల నష్టాన్ని నివారించడానికి, లేదా అసాధారణమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడానికి. ఇటువంటి సందర్భాలలో యజమాని 24 గంటలలోపు సంబంధిత కార్మిక అధికార సంస్థకు తెలియజేయాలని అదనపు పనికి గల కారణాలను మరియు అంచనా వ్యవధిని వివరించాలి." అని ఆయన అన్నారు.
ఓవర్‌టైమ్ మినహాయింపుల ప్రకారం, పగటిపూట చేసే ఓవర్‌టైమ్ గంటలకు కనీసం 50% అదనంగా, రాత్రిపూట చేసే ఓవర్‌టైమ్ గంటలకు 75% అదనంగా కార్మికుడికి అధిక వేతనం లభిస్తుందన్నారు. అలాగే, వీక్లీ హాఫ్ లేదా అధికారిక సెలవు దినాలలో పనిచేసినందుకు సాధారణ రోజువారీ వేతనంతో పాటు మూల వేతనంలో 200% లేదా పనిచేసిన ప్రతి రోజుకు రెండు విశ్రాంతి దినాలు పొందేందుకు కార్మికుడు అర్హుడని డాక్టర్ మహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







