2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- April 26, 2026
దోహా: ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో QR 20.976 బిలియన్ల విలువైన 5,154 రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేసి, బలమైన పనితీరును కనబరిచింది. 2024తో పోలిస్తే, ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీల సంఖ్యలో 45 శాతం, మొత్తం విలువలో 44 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.
ఇక మే నెలలో అత్యధిక వాణిజ్య కార్యకలాపాలు నమోదయ్యాయి. వీటి విలువ QR 2.518 బిలియన్లుగా ఉంది. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ QR 4.097 బిలియన్ల విలువైన లావాదేవీలను, రెండవ త్రైమాసికంలో QR 6.028 బిలియన్లను, మూడవ త్రైమాసికంలో QR 4.491 బిలియన్లను మరియు నాలుగవ త్రైమాసికంలో QR 6.356 బిలియన్ల విలువైన లావాదేవీలను నమోదు చేసింది.
2025 Real Estate Market Index ప్రకారం ఆర్థికపరమైన విలువ పరంగా దోహా, అల్ రాయన్ మరియు అల్ దాయెన్ మున్సిపాలిటీలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నట్లు వెల్లడైంది. గత సంవత్సరంలో దోహా మున్సిపాలిటీ లావాదేవీల విలువ QR 8.622 బిలియన్లకు చేరుకుంది. అల్ రాయన్ మున్సిపాలిటీ QR 5.805 బిలియన్ల విలువతో రెండవ స్థానంలో నిలవగా, అల్ దాయెన్ మున్సిపాలిటీ QR 2.288 బిలియన్ల లావాదేవీల విలువతో మూడవ స్థానంలో నిలిచింది.
అలాగే, అల్ వక్రా మున్సిపాలిటీ QR 1.933 బిలియన్ల విలువైన రియల్ లావాదేవీలను నమోదు చేసింది. దీని తర్వాతి స్థానాల్లో ఉమ్ సలాల్ QR 1.426 బిలియన్లు, అల్ ఖోర్ & తఖిరా QR 505 మిలియన్లు, అల్ షమాల్ QR 381 మిలియన్లు, అల్ షీహానియా మున్సిపాలిటీ QR 12.936 మిలియన్ల విలువైన లావాదేవీలను నమోదు చేశాయి.
2025లో విక్రయించిన ఆస్తుల సంఖ్య పరంగా చూస్తే దోహా 28%, అల్ రాయన్ 27% మరియు అల్ వక్రా మున్సిపాలిటీ 15% తో అత్యంత ప్రభావవంతంగా నిలిచాయి.
ఇక భవనాల్లో చదరపు అడుగుకు సగటు ధర దోహాలో QR 851, అల్ దాయెన్లో QR 546, అల్ రాయన్‌లో QR 456, అల్ వక్రాలో QR 468, ఉమ్ సలాల్లో QR 443, అల్ ఖోర్ & తఖిరాలో QR 386, అల్ షమాల్లో QR 258 మరియు అల్ షీహానియా మున్సిపాలిటీలో QR 173గా నమోదైంది. ఖాళీ స్థలం సగటు ధర చదరపు అడుగుకు దోహాలో QR433, అల్ వక్రాలో QR252, అల్ రయ్యాన్లో QR325, ఉమ్ సలాల్లో QR280, అల్ దాయెన్లో QR329, అల్ ఖోర్ మరియు తఖిరాలో QR146, అల్ షమాల్లో QR146 మరియు అల్ షీహానియాలో QR118 గా నమోదైంది.
ఖతార్‌లోని రియల్ ఎస్టేట్ రంగ కార్యకలాపాలు అద్భుతమైన వృద్ధితో జాతీయ ఆర్థిక వ్యవస్థలో తనదైన పాత్రను పోషిస్తోంది. ఇది ఖతార్ ఆర్థిక వైవిధ్యీకరణ వ్యూహం సాధించిన విజయాన్ని స్పష్టంగా ధృవీకరిస్తోందని నివేదికలో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







