IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- April 28, 2026
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తొలి ఓటమిని చవి చూసింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. 223 రన్స్ టార్గెట్ ను రాజస్తాన్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. రాజస్తాన్ బ్యాటర్లలో ఫెరీరా (52) సూపర్ బ్యాటింగ్ చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక జైస్వాల్ (51), వైభవ సూర్యవంశీ (43), శుభమ్ దూబే (31) రాణించారు. దీంతో రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటివరకు ఈ సీజన్ లో అన్ బీటెన్ గా ఉన్న పంజాబ్ కు…ఓటమి రుచి చూపించింది రాజస్తాన్. పంజాబ్ హోమ్ గ్రౌండ్ లోనే వారిని చిత్తు చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







