ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- April 30, 2026
దోహా: ఖతార్ లో ఈ వారంతంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో భారీ అలలు మరియు దుమ్ముతో కూడిన పరిస్థితులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఖతార్ వాతావరణ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఇక నేడు పగటిపూట వాతావరణం వేడిగా ఉంటుందని, అక్కడక్కడ ఆకాశం మేఘావృతమైన ఉంటుందని, అప్పుడప్పుడు దుమ్ముతో కూడిన గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజులపాటు కూడా ఇదే తీరుగా వాతావరణ ఉంటుందని తెలిపింది.
ఉష్ణోగ్రతలు కనిష్టంగా 26°C నుండి గరిష్టంగా 37°C మధ్య నమోదవుతాయని వివరించింది. ఈ వారాంతంలో గంటకు 30 నాట్ల వేగం వరకు వీచే బలమైన వాయువ్య గాలులు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే సముద్రంలో అలల ఎత్తు కనిష్టంగా 2 అడుగుల నుండి అప్పుడప్పుడు 9 అడుగుల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







