ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- May 01, 2026
అమరావతి: గుంటూరు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, రెడ్డిపాలెం సమీపంలో ఉన్న ‘ఐరా స్పా’ (Aira Spa) సెంటర్‌పై గురువారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొంతకాలంగా ఇక్కడ మసాజ్ పేరుతో వ్యభిచార దందా జరుగుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
ఈ దాడుల్లో పోలీసులు స్పా మేనేజర్ సూర్య అనే వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, పట్టుబడిన మహిళల్లో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తేలింది. వీరికి వ్యభిచార దందాతో ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. స్పా ముసుగులో అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపుతున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
అదుపులోకి తీసుకున్న నలుగురిని తదుపరి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







