‘LIK’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
- May 01, 2026
‘లవ్ టుడే’, ‘డ్యూడ్’, ‘డ్రాగన్’ వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టిన కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ రోమాంటిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది.
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ల పరంగా పరవాలేదనిపించింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. మే 06వ తేదీ నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా ప్రేమ, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







