జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- May 03, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జుబైల్ నగరంలో భారత్ బిజినెస్ నెట్వర్క్ (BBN) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని సాటా వ్యవస్థాపక అధ్యక్షులు MalleSan.com తెలియచేశారు.ఈ కార్యక్రమానికి ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు మరియు భారతీయ కమ్యూనిటీ సభ్యులు భారీగా హాజరై, ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సమావేశం పరస్పర పరిచయాలను పెంపొందించుకోవడం, వ్యాపార అవకాశాల పై చర్చించడం, అలాగే కమ్యూనిటీ అభివృద్ధి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం వంటి ముఖ్య లక్ష్యాలతో నిర్వహించబడింది. పాల్గొన్న వారు సానుకూల దృక్పథంతో తమ ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమం మరింత సార్థకంగా మారింది.
కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించిన వారిలో ముంబై కి చెందిన GIO జుబైల్ అధ్యక్షురాలు రోష్నా సాత్రే వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. అలాగే GWAC కమ్యూనిటీ నాయకుడు ఖలీల్, SATA ప్రతినిధి తరక్, దివాకర్ తమ విలువైన సహకారం అందించారు.
BBN వాలంటీర్లు అర్వింద్, షౌకత్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా, GISA అధ్యక్షుడు అనిల్ మల్పాని, SATA ER అధ్యక్షుడు తేజ, SATA CR రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్, GIO HAIL ఎంబసి Co-ordinator, కేరళ కు చెందిన చంసా రాహామన్, కోబర్ కు చెందిన మణికట్టన్ మరియు ఇతర కమ్యూనిటీ నాయకులు తమ ప్రోత్సాహం అందించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ పరిమితులను దాటి సహకారం, వ్యాపార అవకాశాలు మరియు పరస్పర అభివృద్ధి లక్ష్యాలతో ఒక బలమైన నెట్వర్క్ నిర్మాణానికి బాటలు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించి, భారతీయ సమాజాన్ని మరింతగా ఏకతాటిపైకి తీసుకురావాలని, మే 9న రియాద్ జరిగబోయే భారత్ ప్రొఫెషనల్ మీట్ కు సన్నాహాలు చేస్తున్నామని BBN నిర్వాహకులు రిపబ్లిక్ ప్రతినిధి కు తెలియచేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







