2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- May 04, 2026
రియాద్: 2027 మోడళ్ల వాహనాల కోసం అప్డేటుడ్ ఇంధన సామర్థ్య లేబుల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా "ఏ లేబుల్ యూ నో " అనే పేరుతో ఒక అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సౌదీ ఇంధన సామర్థ్య కేంద్రం (SEEC) ప్రకటించింది.
రెండు వారాలపాటు కొనసాగే ప్రచారంలో వాహన ఇంధన సామర్థ్య లేబుల్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం జరుగుతుందని SEEC వివరించింది. సహజ వనరులను పరిరక్షించడానికి మరియు సౌదీ రవాణా రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపింది.
లేబుల్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా చదివి, అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఈ ప్రచారం అనేక చిట్కాలను అందిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రోజువారీ కారు వినియోగదారులతో పాటు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారిని, అలాగే అత్యంత సమర్థవంతమైన వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వాహనం రకాన్ని బట్టి, మూడు రకాల అప్డేటుడ్ ఇంధన సామర్థ్య లేబుల్‌లు ఉన్నాయని SEEC పేర్కొంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని సంబంధిత స్థానిక మరియు అంతర్జాతీయ భాగస్వాములందరితో కలిసి పనిచేయడం ద్వారా వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







