మే 27న ఈద్ అల్-అధా..!!
- May 04, 2026
కువైట్: ఖగోళ గణనల ఆధారంగామే 27న ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వచ్చే అవకాశం ఉందని కువైట్ ఖగోళ శాస్త్ర సంఘం (Kuwaiti Astronomical Society) పాలక మండలి ఛైర్మన్ అడెల్ అల్-సాదౌన్ ప్రకటించారు. 'ధి అల్-హిజ్జా' నెల మొదటి రోజు మే 18న ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఖగోళ లెక్కల ప్రకారం, మే 26న 'అరఫా దినం' (Day of Arafah) వస్తుంది. ఆ మరుసటి రోజే మే 27న ఈద్ అల్-అధా పండుగ ప్రారంభమవుతుంది. ఈద్ సమయంలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రిపూట మాత్రం కాస్త తగ్గుముఖం పట్టి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అల్-సాదౌన్ పేర్కొన్నారు.
అయితే ఈద్ అల్-అధా పండుగ అధికారిక తేదీని, సంబంధిత అధికారులు నెలవంకను చూసిన తర్వాతే ఖరారు చేస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







