దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- May 04, 2026
యూఏఈ: దుబాయ్ మాల్, దుబాయ్ హిల్స్ మాల్ మరియు మెరీనా మాల్లోని కీలక షాపింగ్ కేంద్రాలలో సరైన పార్కింగ్ సేవలను అమలు చేస్తామని పార్కిన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ పార్కింగ్ సొల్యూషన్స్ కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎమార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. దివ్యాంగుల పార్కింగ్ (PoD) సరైన వినియోగాన్ని నిర్ధారించడం, ట్రాఫిక్ ను మెరుగుపరచడం మరియు పార్కింగ్ సౌకర్యాల వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడం వంటి సరైన పార్కింగ్ మార్గదర్శకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించారు.
ఒక వాహనం ప్రత్యేకంగా కేటాయించిన PoD బేలో పార్క్ చేసిన వెంటనే, చెల్లుబాటు అయ్యే PoD పర్మిట్ ఉందో లేదో ధృవీకరించడానికి పార్కిన్ AI-ఆధారిత అమలు వ్యవస్థ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఆటోమెటిక్ గా స్కాన్ చేస్తుందన్నారు. చెల్లుబాటు అయ్యే పర్మిట్ ఏదీ గుర్తించకపోతే, కంపెనీ కమాండ్ సెంటర్లోని పార్కిన్ ఇన్స్పెక్టర్ ద్వారా జరిమానా నోటీసు జారీ అవుతుందని పార్కిన్ తన ప్రకటనలో వెల్లడించింది.
దుబాయ్ పార్కింగ్ నిబంధనలను సంపూర్ణంగా పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి పార్కిన్ మూడు సైట్లలో ప్రత్యేక ఫీల్డ్ తనిఖీలను నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







