IPL 2026: లక్నో పై ముంబై విజయం
- May 05, 2026
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 229 రన్స్ టార్గెట్ ను ముంబై మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. 6 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రికల్టన్, రోహిత్ శర్మ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు, రిలక్టన్ 32 బంతుల్లో 83 రన్స్ చేశారు. ఈ సీజన్ లో లక్నోకి ఇది డబుల్ హాట్రిక్ ఓటమి. అటు హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఓ విజయం సాధించింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







