ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- May 05, 2026
వివరాల్లోకి వెళ్తే...మొబైల్లో Facebook బ్రౌజ్ చేస్తూ ఉండగా, ఒక వ్యక్తికి “లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి – ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి!” అనే ప్రకటన కనిపించింది. ఆసక్తితో ఆయన అందులోని లింక్‌పై క్లిక్ చేశారు.
ఆ లింక్ http://gdpr.tubi.tv అనే వెబ్‌సైట్‌కి తీసుకెళ్లింది. అది అసలైన వెబ్సైట్లా కనిపించడంతో, అక్కడి నుండి ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ఓపెన్ చేసి సినిమా కూడా చూశాడు. అంతా సాధారణంగానే అనిపించింది… కానీ… అసలు ప్రమాదం అక్కడే దాగి ఉంది!
కొంతసేపటికి ఫోన్లో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతున్నట్లు కనిపించింది. దాన్ని సాధారణ అప్డేట్గా భావించాడు. అయితే, కొన్ని నిమిషాల తరువాత మొబైల్ సరిగా పనిచేయకపోవడం, UPI సేవలు స్పందించకపోవడం, ఇతర యాప్‌లు ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆందోళనతో వెంటనే బ్యాంక్ యాప్ చెక్ చేశాడు. దీనితో ఆయన వెంటనే తన బ్యాంక్ అప్లికేషన్‌ను పరిశీలించగా, తన ఖాతా నుండి ₹80,000 డెబిట్ అయినట్లు గుర్తించారు. అదే మొబైల్ ద్వారా నిర్వహిస్తున్న తన తల్లి బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, ఆ ఖాతా నుండి కూడా ₹95,000 డెబిట్ అయినట్లు తెలిసింది.
దీంతో మొత్తం ₹1,75,000/- మొత్తాన్ని ఆయన కోల్పోయారు.
అసలు ఏమి జరిగింది?
డౌన్లోడ్ చేసిన యాప్ అసలు Tubi TV కాదు. అది అదే పేరుతో రూపొందించిన నకిలీ (మాల్వేర్) అప్లికేషన్.
ఈ మాల్వేర్ ఫోన్లోకి చొరబడి SMS, OTPలను చదివి, బ్యాంకింగ్ యాప్స్‌కి యాక్సెస్ తీసుకుని ఖాతాల నుండి డబ్బులు దోచుకుంది.
జాగ్రత్తలు:
✅ సోషల్ మీడియాలో వచ్చే “Free Movie” లింకులను నమ్మవద్దు.
✅ APK ఫైళ్ళను / తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు.
✅ అనుమానాస్పద యాప్‌లకు Permissions ఇవ్వవద్దు.
✅ Fake “Software Update” నోటిఫికేషన్లను క్లిక్ చేయవద్దు.
✅ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్డేట్స్ను అధికారిక ఫోన్ సెట్టింగ్స్ ద్వారానే చేయాలి.
మోసానికి గురైతే వెంటనే చేయాల్సినవి:
• వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్‌ను నిలిపివేసి, అనుమానాస్పద యాప్‌లను తొలగించండి
• బ్యాంక్ పాస్వర్డ్లు, UPI PIN మరియు ఇతర లాగిన్ వివరాలను మార్చండి
• సంబంధిత బ్యాంక్‌ను వెంటనే సంప్రదించి ఖాతా భద్రత చర్యలు తీసుకోండి
• 1930 – సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి.
తాజా వార్తలు
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!







