#RN23 అనౌన్స్‌మెంట్
- May 06, 2026
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
"షౌటింగ్ సూన్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోంది.
త్వరలోనే ముహూర్తం వేడుకతో చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇతర నటీనటులు, సాంకేతిక బృందం రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు: రోహిత్ నారా
నిర్మాణ సంస్థ: కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
నిర్మాత: భరత్ చౌదరి
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







