'దేత్తడి' సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం
- May 06, 2026
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు.
ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
“'దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది.
ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.
తారాగణం: ఆశిష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు)
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







