మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- May 13, 2026
రియాద్: 2026 హజ్ సీజన్లో పాల్గొనే సిబ్బంది అందరూ తమ విధులు ప్రారంభించడానికి ముందే మెనింగోకాకల్ వ్యాక్సింగ్ తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దులజీజ్ అబ్దుల్బాకీ స్పష్టం చేశారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి, నివారణ చర్యలను బలోపేతం చేయడానికి సుప్రీం హజ్ కమిటీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య చేపట్టింది. రద్దీగా ఉండే వాతావరణాల్లో వ్యాపించే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుండి ఈ టీకా రక్షణ కల్పిస్తుందని అబ్దుల్బాకీ వివరించారు. ఆమోదించబడిన మెనింగోకాకల్ వ్యాక్సింగ్ ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందన్నారు.
హజ్ సీజన్లో పని అనుమతి (Work Permit) పొందడానికి టీకా ప్రక్రియను పూర్తి చేయడం ఒక ముందస్తు షరతు అని ప్రతినిధి స్పష్టం చేశారు. టీకా పూర్తిస్థాయి రక్షణను అందించాలంటే, పని ప్రారంభించడానికి కనీసం 10 రోజుల ముందే దానిని తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే, కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా (Seasonal Influenza) మరియు COVID-19 టీకాలను కూడా తప్పక తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కోసం సెహతీ యాప్‌లో “అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్” సర్వీస్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అబ్దుల్బఖీ తెలిపారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







