దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- May 13, 2026
దోహా: దోహా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (DFI), దోహా ఫిల్మ్ ఫెస్టివల్ (DFF) 2026 ఎడిషన్ కోసం అధికారికంగా సినిమాల దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు తమ చిత్రాలను ప్రదర్శించాలని కోరింది.
దరఖాస్తుల స్వీకరణ మే 10న ప్రారంభమైంది. ప్రస్తుతం కేవలం మూడు కీలక విభాగాలలో మాత్రమే షార్ట్ ఫిల్మ్ లను స్వీకరిస్తున్నారు. మేడ్ ఇన్ ఖతార్, అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీ, మరియు అజ్యాల్ ఫిల్మ్ పోటీ (షార్ట్స్ విభాగం)లు నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ నవంబర్ 19 నుండి 27 వరకు జరగనుంది.
ఆసక్తి ఉన్న చిత్రనిర్మాతలు తమ ఎంట్రీలను http://www.dohafilm.com లోని అధికారిక DFI ప్లాట్‌ఫారమ్ ద్వారా సమర్పించాలని సూచించారు. అంతర్జాతీయ షార్ట్ సినిమా పోటీ మరియు అజ్యాల్ షార్ట్ సినిమా పోటీలకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 1 కాగా, మేడ్ ఇన్ ఖతార్ విభాగానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







