Danalac శిశు ఆహారం పారవేసివేయాలని యూఏఈ పిలుపు..!!
- May 16, 2026
యూఏఈః Danalac శిశు ఆహారం (infant formula) దేశంలో నమోదు కాలేదని, అలాగే ఇది అధికారిక మార్గాల ద్వారా దిగుమతి కాలేదని UAE తెలిపింది. ఈ మేరకు ఎమిరేట్స్ ఔషధ సంస్థ సోషల్ మీడియాలో ఒక విడుదల ఒక ప్రకటన విడుదల చేసింది.
స్థానిక మార్కెట్లలో ఈ ఉత్పత్తి విస్తృతంగా ఉందని ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో, విదేశాల నుండి దీనిని కొనుగోలు చేసినవారు లేదా వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్నవారు, పిల్లల ఆరోగ్యం మరియు ప్రజల భద్రతను కాపాడేందుకు దీనిని వెంటనే పారవేసివేయాలని వారు సూచించారు.
కొన్ని వారాల క్రితం, కువైట్ అధికారులు ఈ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని బ్యాచ్‌లను మార్కెట్లలోని అరల నుండి తొలగించారు. భద్రతా హెచ్చరికల నేపథ్యంలో, Danalac మేక పాలతో తయారైన శిశు ఆహారం (goat milk infant formula) పలు బ్యాచ్‌లను ముందు జాగ్రత్త చర్యగా వెనక్కి తీసుకుంటున్నట్లు కువైట్ ఆహార మరియు పోషణ అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







