ఫహహీల్ పారిశ్రామిక ప్రాంతంలో 95 దుకాణాలు సీజ్..!!
- May 16, 2026
కువైట్ః భద్రత మరియు అగ్ని నివారణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న భవనాలు మరియు సంస్థలపై కువైట్ ఫైర్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. ఫహహీల్ పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీలను నిర్వహించారు. ఆమోదిత భద్రతా ప్రమాణాలు మరియు ఫైర్ నివారణ అవసరాలను పాటించడంలో విఫలమైన దుకాణాలు మరియు సదుపాయాలకు నోటీసులు అందజేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా 95 దుకాణాలపై ఉల్లంఘన నోటీసులు జారీ చేయడం జరిగిందని పేర్కొంది.
ప్రజల భద్రతను మెరుగుపరచడం, నిబంధనలను పాటించేలా చూడటం, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలకు సంబంధించిన నష్టాలను తగ్గించడం కోసం జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగానే ఈ తనిఖీలను నిర్వహించినట్టు ఫైర్ ఫోర్స్ తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







