కె.ఎల్.రావు వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
- May 18, 2026
అమరావతి: భారతదేశ చరిత్రను మార్చిన హీరాకుడ్, భాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి బహుళార్దక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్. రావు అని కొనియాడారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం అమరావతి సచివాలయంలో పద్మభూషణ్ డాక్టర్.కె.ఎల్ రావు వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్. కె.ఎల్ రావు సేవలు అందరికీ స్పూర్తి దాయకం, ఆదర్శనీయం అని అన్నారు.
ఈ రోజు అందరం మాట్లాడుకుంటున్న నదుల అనుసంధానం గురించి, దేశంలో మొదటి సారిగా ప్రతిపాదించిన వ్యక్తి కె.ఎల్.రావు అని అన్నారు. అందుకే ఆయన మనకు ఒక స్పూర్తి అని మంత్రి నిమ్మల తెలిపారు. దేశంలో కరువు కాటకాలు పోవాలంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని, గంగా, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంటి నదుల అనుసంధానంతోనే సాధ్యమౌతుందని ప్రగాఢంగా నమ్మిని వ్యక్తి కె.ఎల్ రావు అని అన్నారు.
కె.ఎల్ రావు స్పూర్తిని నాడు వాజ్‌పేయ్, నేడు ప్రధాని మోధీ అందిపుచ్చుకున్నారని, ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పట్టి సీమ నిర్మాణం ద్వారా గోదావరి నుండి కృష్ణాకు గోదావరి జలాలను తరలించి నదుల అనుసంధాన కార్యక్రమానికి భీజం వేశారని తెలిపారు. నాడు 1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 5ఏళ్ళలోనే 50వేల కోట్ల ఆదాయం సృష్టించిందని స్పష్టం చేశారు. భవిష్యత్ లో కూడా కె.ఎల్ రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేలా, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేసేలా చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, సిఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







