ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- September 16, 2026
హైదరాబాద్: ఈ నెల 17 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ సమర్థవంతమైన, దార్శనిక నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత వైపు మరింత వేగంగా ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ సేవలో ప్రధాని మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఈ సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







