‘పెద్ది’ ట్రైలర్ కు కాంతార హీరో రివ్యూ ..
- May 19, 2026
పెద్ది ట్రైలర్, రామ్ చరణ్ అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ పై ప్రశంసల వర్షం కురిపించిన రిషబ్ శెట్టి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనకు తోడు ఇప్పుడు ప్రముఖ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించడం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
రా అండ్ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని ఫియర్స్ అవతార్‌లో మెస్మరైజ్ చేశారు. ఆయన రగ్గడ్ మేకోవర్, ఫిజిక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేశాయి . ఇదే విషయాన్ని రిషబ్ శెట్టి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
“ప్రతి ఫ్రేమ్‌లో రామ్ చరణ్ అబ్సల్యూట్ ఫైర్‌లా కనిపించారు” అంటూ ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను కొనియాడారు. అలాగే శివరాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కు మరో గొప్ప స్థాయిని తీసుకెళ్లిందని చెప్పారు. జాన్వీ కపూర్ కథలో తీసుకొచ్చిన వైబ్రెంట్ ఎనర్జీని కూడా ఆయన ప్రశంసించారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా విజన్, భారీ స్థాయి మేకింగ్, పవర్‌ఫుల్ విజువల్ స్టోరీటెల్లింగ్‌ను కూడా రిషబ్ శెట్టి ప్రత్యేకంగా అభినందించారు. విజువల్‌గా అద్భుతంగా, భావోద్వేగాలతో నిండిన డ్రామాను మొత్తం టీమ్ కలిసి తీర్చిదిద్దిందని ప్రశంసించారు.
ఇప్పటికే అన్ని భాషల్లో ట్రైలర్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







