యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్

- May 23, 2026 , by Maagulf
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్

యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న సీఎం, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నెలకొనగా, అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com