భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- May 23, 2026
చంద్రయాన్-3 మిషన్‌కు ప్రతిష్టాత్మక 'గొడ్దార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు 2026'!
న్యూ ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సాధించిన చారిత్రాత్మక విజయానికి అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం లభించింది. భారతదేశపు ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లూనార్ మిషన్, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ (AIAA) అందించే "2026 గొడ్దార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు" కు ఎంపికైంది. వాషింగ్టన్ డిసిలో జరిగిన AIAA ASCEND కాన్ఫరెన్స్‌లో ఇస్రో తరపున అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష విజయాలు సాధించిన వారికి అందించే అత్యున్నత గౌరవమైన ఈ అవార్డును, రాకెట్ పితామహుడు రాబర్ట్ హెచ్. గొడ్దార్డ్ జ్ఞాపకార్థం నెలకొల్పారు.
ఆగస్టు 23, 2023న చంద్రయాన్-3 అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సురక్షితంగా ల్యాండింగ్ అయి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశమూ అన్వేషించని ఈ క్లిష్టమైన ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్ సేకరించిన కీలకమైన డేటా, చంద్రుని దక్షిణ ధ్రువ నేలలో ఉన్న రసాయన మూలకాలను నిర్ధారించడమే కాకుండా, భవిష్యత్తులో మానవ సహిత చంద్రమండల యాత్రలకు మరియు అక్కడ స్థానిక వనరులను వాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అవార్డు స్వీకరణ సందర్భంగా భారత రాయబారి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'స్పేస్ విజన్ 2047' రోడ్‌మ్యాప్‌ను వివరించారు. భారతదేశపు లోతైన అంతరిక్ష పరిశోధనలు, మానవ అంతరిక్ష యాత్రలు మరియు అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ఆయన ఈ సందర్భంగా హైలైట్ చేశారు.
ఈ అవార్డు అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు మరియు ఇస్రో సాధించిన సాంకేతిక పురోగతికి దక్కిన నిలువెత్తు నిదర్శనం.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







